- Advertisement -
మహారాష్ట్ర బలపరీక్షలో నెగ్గారు సీఎం ఏక్‌నాథ్ షిండేఏ. ఇవాళ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో ఆయనకు అనుకూలంగా 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఓటింగ్‌లో ప్రతిపక్షానికి 99 ఓట్లు పోలయ్యాయి. ఎమ్మెల్యేల లెక్కింపు ద్వారా మెజారిటీని తేల్చారు.
కొన్ని వారాల నుంచి సాగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ సంక్షోభం అనూహ్య మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. శివసేన రెబల్‌గా షిండే తిరుగుబాటు చేయడంతో ఉద్దవ్ ఠాక్రే తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఏక్‌నాథ్ సీఎం అయ్యారు. బీజేపీ నేత , మాజీ సీఎం ఫడ్నవీస్…ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
- Advertisement -

