తమన్నా టాక్ షోలో స్టార్ హీరోలు

98
tamannha

మిల్కీ బ్యూటీ తమన్నా వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటిస్తుంది. సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోలతో కూడా సినిమాలు చేస్తూ సక్సెస్ సాధిస్తుంది. ఇక ఇన్ని రోజులు హీరోయిన్ గా చేసిన తమన్నా ఇక నుంచి బుల్లితెరపై కూడా కనిపించనుంది. ఇప్పటికే తమిళ్ లో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుండగా తాజాగా తెలుగులో మరో వెబ్ సిరీస్ లో నటించేందుకు అంగికరించింది. అల్లు అరవింద్ ఆహా అనే ఓటీటీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఈ నేపధ్యంలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాతో స్పెషల్ గా ఓ టాక్ షో ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.. ఇప్పటికే ఈ టాక్ షో కోసం త‌మ‌న్నాతో చర్చలు కూడా ముగిసాయని, దీనికి తమన్నా కూడా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసినట్టుగా తెలుస్తోంది. ఈ షోలో స్టార్ హీరోలు, హీరోయిన్ లను తమన్నా ఇంటర్వూ చేయనుంది. తాజాగా ఉన్న సమాచారం మేరకు మొదటగా అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో ఇంటర్వూ చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా తమన్నా ప్రస్తుతం గోపిచంద్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీటిమార్ సినిమాలో నటిస్తుంది.