రైతు చట్టాలను అమలుచేయం:మహారాష్ట్ర స్పీకర్

167
farm laws
- Advertisement -

మహారాష్ట్రలో కొత్త వ్యవసాయ చట్టాలను అమలు చేయమని స్పష్టం చేశారు స్పీకర్ నానా పటేల్. అసెంబ్లీలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కొత్త సాగు చ‌ట్టాల‌ను అమ‌లు చేయ‌మ‌ని తేల్చిచెప్పారు.

కొత్త సాగు చ‌ట్టాల‌పై రాష్ర్ట ప్ర‌భుత్వం ఓ క‌మిటీని ఏర్పాటు చేసి స‌మీక్షిస్తుంద‌ని వెల్లడించారు. రాష్ర్టంలో ఈ చ‌ట్టాల‌ను అమ‌లు చేయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. తాను కూడా రైతునే కాబ‌ట్టి అన్న‌దాత‌ల నిర‌స‌న‌కు త‌ప్ప‌కుండా మ‌ద్ద‌తు తెలియ‌జేస్తాన‌ని స్పీక‌ర్ పేర్కొన్నారు.

రైతులు త‌మ స‌మ‌స్య‌ల‌పై మెమోరాండం ఇచ్చేందుకు స‌మ‌యం కోరితే గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోశ్యారి ఇవ్వ‌లేద‌న్నారు. కంగ‌నా ర‌నౌత్‌కు స‌మ‌యం ఇచ్చిన గ‌వ‌ర్న‌ర్ రైతుల‌కు ఇవ్వ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

- Advertisement -