భారత్‌కు శుభాకాంక్షలు తెలిపిన బ్రిటన్ ప్రధాని..

81
britan pm

భారత 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు బిట్ర‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్. ఇది ప్ర‌పంచంలోనే అసాధార‌ణ రాజ్యాంగానికి జ‌న్మ‌దిన‌మ‌ని కొనియాడారు. ఇది అసాధార‌ణ‌మైన రాజ్యాంగానికి పుట్టిన‌రోజు. ఆ అసాధార‌ణ రాజ్యాంగ‌మే భార‌త్‌ను ప్ర‌పంచంలోనే అత్యంత శ్రేష్ఠ‌మైన ప్ర‌జాస్వామ్య దేశంగా నిల‌బెట్టింది. భార‌త్ అంటే నాకు గుండెల నిండా అభిమానం ఉన్న‌ది. ఆ దేశానికి, అక్క‌డి ప్ర‌జ‌ల‌కు నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు అని బోరిస్ జాన్స‌న్ త‌న సందేశంలో పేర్కొన్నారు.