మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా..

186
coroana
- Advertisement -

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతున్నది. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 7,539 పాజిటివ్‌ కేసులు, 198 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,25,197కు, మరణాల సంఖ్య 42,831కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 16,177మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 14,31,856కి చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 1,50,011 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.

- Advertisement -