మహారాష్ట్రలో మరో రెండు వారాలు లాక్‌డౌన్..

44
lock

మహారాష్ట్రలో కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో మళ్లీ రెండు వారాలపాటు లాక్ డౌన్ విధించారు. లాక్‌డౌన్‌ను మ‌రో రెండు వారాలు అమ‌లు చేయాల‌ని డిమాండ్ పెరుగుతున్న నేప‌థ్యంలో సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే నేతృత్వంలో ఇవాళ మంత్రిమండ‌లి స‌మావేశం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్శంగా రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితులు, లాక్‌డౌన్ పొడిగింపు అంశంపై నిర్ణ‌యం తీసుకోనున్నారు.

ప్రస్తుతం మహారాష్ట్రలో విధించిన లాక్‌డౌన్ 15తో ముగియనుండగా లాక్‌డౌన్‌ను పొడిగించాలా లేదా ఎత్తివేయాలా అనే అంశంపై నిర్ణ‌యం తీసుకోనున్నామ‌ని రాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి రాజేశ్ తోప్ అన్నారు. గత 24 గంటల్లో 37,236 కేసులు న‌మోద‌వ‌గా దీంతో మొత్తం కేసులు 51,79,929కి చేరాయి.