మహారాష్ట్రలో జూన్ 1 వరకు లాక్‌డౌన్..

141
lockdown
- Advertisement -

మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్‌ను పొడగించింది ప్రభుత్వం. జూన్ 1 ఉదయం 7 గంటల వరకు లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని మహా ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రానికి వచ్చే ఇతర స్టేట్ ప్రజలు ఆర్టీ పీసీఆర్ నెగిటివ్ రిపోర్టును తప్పక సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలో ఆరు నుంచి ఎనిమిది వారాలు లాక్ డౌన్ ను అమలు చేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. ఇన్ఫెక్షన్ రేటు 10 శాతానికి పైగా ఉన్న జిల్లాల్లో లాక్ డౌన్ ను పొడిగించాల్సిన ఆవశ్యకత ఉందని… పాజిటివ్ రేటు 5 నుంచి 10 శాతం మధ్యలో ఉంటే లాక్ డౌన్ తీసేయ్యొచ్చని పేర్కొంది.

- Advertisement -