మహారాష్ట్రలో కమలం హవా

493
maha elections
- Advertisement -

మహారాష్ట్ర,హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ,రెండు లోక్ సభ స్ధానాల కౌంటింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్రలో శివసేన-బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తుండగా హర్యానాలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.

సార్వత్రిక ఎన్నికల తర్వాత, ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరిగిన అతిపెద్ద ఎన్నికలు కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. హర్యానాలో కర్నాల్ స్థానంలో సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ఆధిక్యతలో ఉండగా, మహారాష్ట్ర సీఎం దేవేందర్ ఫడణ్‌వీస్ నాగ్‌పూర్ సౌత్ స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.

మహారాష్ట్రలో ఇప్పటి వరకు 230 స్థానాల్లో తొలి రౌండ్ పూర్తవగా బీజేపీ-శివసేన కూటమి 164 స్థానాల్లోనూ, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 61 చోట్ల, ఇతరులు 10 చోట్ల ఆధిక్యతలో ఉన్నారు. ఎంఐఎం పార్టీ మూడు చోట్ల ఆధిక్యంలో ఉంది.బారామతిలో కాంగ్రెస్ నేత అజిత్ పొవార్ స్పష్టమైన మెజార్టీ దిశగా సాగుతున్నారు

హర్యానాలో బీజేపీ 37, కాంగ్రెస్ 29, ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. కొంకణ్‌ ప్రాంతంలో శివసేన, ముంబయి నగరం, మరఠ్వాడలో బీజేపీ-శివసేన కూటమి ముందంజలో ఉంది. అయితే ఉత్తర, పశ్చిమ మహారాష్ట్రలో ఎన్సీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

- Advertisement -