హిందీ భాషా వివాదంపై వెనక్కి తగ్గింది మహారాష్ట్ర ప్రభుత్వం. మరాఠీ, ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మూడో భాషగా హిందీని తప్పనిసరిగా బోధించాలని ఇటీవలె ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే తాజాగా ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గింది. హిందీ తప్పనిసరి అన్న పదాన్ని నోటిఫికేషన్‌లో తీసేసింది. ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది మహా సర్కార్.
కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత విజయ్ వడెట్టివార్ స్పందిస్తూ, ఈ నోటిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. హిందీ తప్పనిసారి ఏమీ కాదని స్పష్టం చేసింది. త్రిభాషా సూత్రాన్ని ప్రభుత్వ వ్యవహారాలకే పరిమితం చేసుకోవాలని, విద్య విషయంలో దానిని తీసుకురావద్దని హెచ్చరించారు ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే. మహారాష్ట్రలో ప్రతి దానినీ హిందీయీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అనుమతించేది లేదన్నారు.
Also Read:రేణిగుంట విమానాశ్రయం పేరు మార్పు!

