మ‌హారాష్ట్ర‌లో ఒకే రోజు 20,482 మందికి క‌రోనా..

144
corona

మ‌హారాష్ట్ర‌లో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. ఇక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న‌ది. మంగ‌ళ‌వారం కూడా 20,482 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,97,856కు చేరింది. అందులో 7,75,273 మంది ఇప్ప‌టికే వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 2,91,797 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక క‌రోనా మ‌రణాలు కూడా మ‌హారాష్ట్ర‌లో భారీగానే న‌మోద‌వుతున్నాయి. మంగ‌ళ‌వారం కూడా కొత్త‌గా 515 మంది క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 30,409కి చేరింది. మ‌హారాష్ట్ర ఆరోగ్య‌శాఖ అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.