మహారాష్ట్రలో లక్షదాటిన కరోనా కేసులు..

193
coronavirus
- Advertisement -

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 2 గంటల్లో 11,458 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వైరస్‌ బారినపడి 386 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,08,993కి చేరగా 8884 మంది మృత్యువాత పడ్డారు.

ఇక దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర తొలి స్ధానంలో ఉంది. ఇప్పటివరకు మహారాష్ట్రలో లక్ష కేసులు నమోదయ్యాయి. 96 రోజుల్లో లక్ష కేసులు నమోదయ్యాయి. రెండో 50 వేల కేసులు నమోదుకావడానికి కేవలం 19 రోజుల సమయం మాత్రమే పట్టింది.

మహారాష్ట్రలో ఇప్పటివరకు మొత్తం 1,01,141 కరోనా కేసులు నమోదుకాగా 3,717 మంది మృత్యువాత పడ్డారు. తొలిమరణం ఏప్రిల్ 18న సంభవించింది.దేశ వాణిజ్య నగరం ముంబైని కరోనా వణికిస్తోంది. ఒక్క ముంబై నగరంలోనే కరోనాతో 1855 మంది మరణించారు. ముంబై నగరంలో కేసుల సంఖ్య 52,445కు చేరగా కరోనా పుట్టిన వుహాన నగరాన్ని దాటేసింది.

- Advertisement -