మహారాష్ట్ర బీజేపీ చీఫ్ కుమారుడి బీభత్సం..

8
- Advertisement -

మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుఉడ చంద్రశేఖర్ భవంకులే కుమారుడు కారుతో బీభత్సం సృష్టించాడు. తన ఆడి కారుతో మ‌రో కారును ఢీకొట్టాడు. టూ వీల‌ర్ వాహ‌నాన్ని కూడా ఢీకొట్టుతూ వెళ్లగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రాత్రి ఒంటి గంట‌కు ఈ ప్ర‌మాదం జ‌రుగగా కారులో ఐదుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సంకేత్‌తో పాటు ముగ్గురు ప‌రారీ కాగా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీర్ బార్ నుంచి వ‌స్తున్న స‌మ‌యంలో ఆడీ కారు బీభ‌త్సం సృష్టించింది. అరెస్టు చేసిన వ్య‌క్తుల నుంచి ర‌క్త‌పు శ్యాంపిళ్ల‌ను తీసుకున్నారు.

ఈ ఘ‌ట‌న ప‌ట్ల కేసు రిజిస్ట‌ర్ చేసిన‌ట్లు ఇన్‌స్పెక్ట‌ర్ అనామికా మీర్జాపూర్ తెలిపారు. అరెస్టు చేసిన నిందితుల్ని అర్జున్ హ‌వ్రే, రోనిత్ చిత్తంవార్‌గా గుర్తించారు.

 

Also Read:మళ్లీ ఉగ్రరూపం దాల్సిన గోదావరి..

- Advertisement -