మహారాష్ట్ర లెవల్ 5 అన్‌లాక్‌..ఆ జిల్లాల్లో ఆంక్షలు ఎత్తివేత!

39
maharashtra

కరోనా సెకండ్ వేవ్ కట్టడిలో భాగంగా మహారాష్ట్రలో కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుతుండటంతో 5-లెవల్ అన్‌లాక్ వ్యూహాన్ని ప్రకటించారు సీఎం ఉద్దవ్ థాక్రే. రాష్ట్రంలోని మొత్తం 36 జిల్లాల్లోని 18 జిల్లాల్లో కొవిడ్ ఆంక్షలను నేటి నుంచి ఎత్తివేస్తున్నట్లుప్రకటించారు.

ఈ 18 జిల్లాల్లో ఔరంగాబాద్, భండారా, బుల్ధానా, చంద్రపూర్, ధూలే, గాడ్చిరోలి, గోండియా, జల్గావ్, జల్నా, లాటూర్, నాగ్పూర్, నాందేడ్, నాసిక్,యావత్మల్, వాషిమ్, వార్ధా, పర్భాని, థానే ఉన్నాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో లెవల్-2లో ఉంది. ముంబై నగరంలో ఆంక్షలు పాక్షికంగాసడలించనుంది. కానీ, స్థానిక రైళ్ల సర్వీసులు మాత్రం నిలిచిపోయాయి. ప్రస్తుతానికి సాధారణ ప్రజలకు స్థానిక రైల్వే సర్వీసులు అందుబాటులో ఉండవు.

ఇక మహారాష్ట్రలో మెత్తం కేసుల కేసుల సంఖ్య 57,76,184కు చేరగా 96,751 మంది మృతిచెందారు. కరోనా నుండి 54,60,589 మంది కోలుకున్నారు. కరోనా వైరస్ రికవరీ రేటు 94.54 శాతానికి చేరుకుంది.