దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..

58
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,32,364 కేసులు నమోదుకాగా 2713 మంది ప్రాణాలు కొల్పోయారు. దేశంలో మొత్తం పాజిటివ్‌కేసుల సంఖ్య 2,85,74,350కు చేరగా 2,65,97,655 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 16,35,993 యాక్టివ్ కేసులుండగా 3,40,702 మంది కరోనాతో మృతిచెందారు. ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 93.08 శాతానికి పెరగగా టీకా డ్రైవ్‌లో భాగంగా 22,41,09,448 డోసులు చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.