వసూళ్లలో మహారాజ జోరు!

8
- Advertisement -

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లేటెస్ట్ మాస్టర్ పీస్ ‘మహారాజ’. నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఎన్‌విఆర్ సినిమా ఈ మూవీని ఏపీ, తెలంగాణలలోమ్యాసీవ్ గా రిలీజ్ చేసింది. విజయ్ సేతుపతి 50వ సినిమాగా జూన్ 14న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి విమర్శకులు ప్రసంశలు అందుకొని మాస్టర్ పీస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

నాలుగు రోజుల్లో రూ.40 కోట్ల మేర గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇక తెలుగులో ఈ సినిమా రూ.10 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టగా రానున్న రోజుల్లో ఈ వ‌సూళ్లు ఇంకా పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో అనురాగ్ క‌శ్య‌ప్, మ‌మ‌తా మోహ‌న్ దాస్, అభిరామి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమా విజ‌య్ సేతుప‌తి కెరీర్ లో 50వ సినిమా.

Also Read:Kalki 2898 AD:’భైరవ అంథమ్’ అదుర్స్

- Advertisement -