నిరాడంబరంగా ఉజ్జయిని మహంకాళీబోనాలు..

703
mahankali bonalu
- Advertisement -

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు ప్రారంభమయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భక్తులు లేకుండా తొలిసారి అధికారులు, అర్చకుల సమక్షంలో బోనాల వేడుక జరుగుతోంది.

భక్తులందరూ తమ తమ ఇళ్లలోనే బోనాలు సమర్పించుకుంటున్నారు. బోనాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.

బోనాల సందర్భంగా లష్కర్‌ ప్రాంతంలో రోజు మద్యం దుకాణాలు మూసివేయాలని సీపీ అంజనీకుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. నార్త్‌జోన్‌లోని గోపాలపురం,చిలకలగూడ, లాలాగూడ, తుకారాంగేట్‌, మహంకాళి, మార్కెట్‌, మారేడ్‌పల్లి, కార్ఖానా, బేగంపేట్‌, తిరుమలగిరి, సెంట్రల్‌ జోన్‌ పరిధిలోని రాంగోపాల్‌పేట్‌,గాంధీనగర్‌ పోలీస్టేషన్ల పరిధుల్లో ఉండే అన్ని మద్యం దుకాణాల మూసివేయించారు.

- Advertisement -