మన్మధుడు2లో మహానటి

181
Manmadhudu 2

కింగ్ నాగార్జున చాలా రోజుల తర్వాత నటిస్తున్న సినిమా మన్మధుడు2. యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈమూవీలో నాగార్జున సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ పోర్చుగల్ లో జరుగుతుంది. సొంత బ్యానర్ లో నాగార్జున ఈమూవీని నిర్మిస్తున్నారు. ఈచిత్రం షూటింగ్ ఎక్కువ శాతం విదేశాలలోనే చిత్రికరించనున్నారు. అక్కినేని సమంత కూడా ఈమూవీలో ఓ కీలక పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది.

తాజాగా మరో టాప్ హీరోయిన్ కూడా ఈమూవీలో కనిపించనుందని సమాచారం. మహానటి మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ కూడా మన్మధుడు లో ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది టాలీవుడ్ వర్గాల సమాచారం. నాగార్జున ఈమూవీతో పాటు బంగార్రాజు లో కూడా నటించనున్నాడు. సోగ్గాడే చిన్నినాయన మూవీకి ఇది సీక్వేల్ గా తెరకెక్కిస్తున్నారు. ఈమూవీలో నాగచైతన్య కీలక పాత్రలో నటించనున్నాడు. ఇక నాగార్జున నటిస్తున్న మన్మధుడు 2 మూవీ దసరా కానుకగా విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు చిత్రయూనిట్.