జగన్ క్యాబినెట్ లో కాంగ్రెస్ మాజీ ఎంపీ

260
Ys Jagan Undavalli
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఎన్నికలు రసవర్తంగా సాగిన విషయం తెలిసిందే. టీడీపీ, వైసిపి ఇరు పార్టీలు అధికారం పై గట్టి ధీమాతో ఉన్నాయి. ఎక్కువ శాతం సర్వేలు మాత్రం వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పాయి. అయితే ఎపీలో ఇప్పటికే జగన్ క్యాబినెట్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. జగన్ కు సన్నిహితంగా ఉండే కొంత మంది మాత్రం తనకు మంత్రి పదవి ఖాయం అన్నట్లు తమ సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారట.

ఇక తాజాగా జగన్ ఓ మాజీ ఎంపీని వైసీపీలో చేరాలని సూచించారట. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను వైసీపీలో చేరాలని ఆహ్వానం పంపించారట జగన్. తమ పార్టీ అధికారంలోకి వస్తే కీలకమైన మంత్రి కూడా ఇస్తామని చెప్పారట. ఉండవల్లి కూడా ఇందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. రాష్ట్ర అభివృద్ది కోసం సీనియర్ రాజకీయ నాయకులు, మేధావుల అవసరం చాలా ఉందన్నారు. త్వరలోనే ఉండవల్లి పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది.

ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో రాజమండ్రి నుంచి ఎంపీగా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కొద్ది కాలం నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఉండవల్లి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉండేవాడు. అందుకోసమే జగన్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తుంది. జగన్ ఆహ్వానం మేరకు ఉండవల్లి పార్టీలో చేరుతారో లేదో చూడాలి మరి.

- Advertisement -