నేడే అక్షయ తృతియ..

328
akshaya tritiya
- Advertisement -

అక్షయతృతియ రోజు బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని పురాతన ఆచారం. గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా అక్షయతృతియ రోజు బంగారంను కొంటారు. అక్షయ తృతియకు చాలా విశిష్టత ఉంది.అక్షయ అంటే తరగనిది అని అర్థం. పురాణాల్లో అక్షయపాత్ర గురించి విని ఉంటాం. ఈ పాత్ర కలిగిన వారి ఇంటికి ఎంత‌మంది అతిథులు వచ్చినా కావాల్సినంత ఆహారాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ పర్వదినాన పూజలు నిర్వహిస్తారు. వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అంటే కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహారంలోకి వచ్చింది. అక్షయ తృతీయ నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి.

అక్షయ తృతీయకు ఎంతో విశిష్టత ఉంది. మత్స్య పురాణం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ రోజున చేసే ఏ వ్రతమైనా, జపమైనా, దానాలు ఏవైనా సరే అక్షయమౌతుంది. పుణ్య కార్యాచరణతో వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణతో వచ్చే పాపం అక్షయమే అవుతుంది. అక్షయ తృతీయ రోజున ఉపవాస దీక్ష చేసి ఏ పుణ్య కర్మనాచరించినా అక్షయముగా ఫలము లభిస్తుందని తెలిపాడు. అందుకే అక్షయుడైన విష్ణువును పూజిస్తున్నందునే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది.

అక్షయ తృతీయ నాడు ఎవరికైనా దానం చేస్తే భగవంతుడు వారికి వరాలనిస్తాడని నమ్మకం. ఇక ఏ కార్యక్రమైనా ప్రారంభించటానికైన అక్షయ తృతీయకు మించిన ముహూర్తం లేదంటారు.

- Advertisement -