‘మహానటి’కి బాలయ్య ప్రశంసలు..

294
Mahanati box office collection
- Advertisement -

సావిత్రి చనిపోయి చాలాకాలమే అవుతోంది. ఆమె ఎందుకు తన ఆరోగ్యాన్ని పాడుచేసుకుని మరణానికి చేరువయ్యారు అనే సందేహాలు అప్పటి నుంచి అభిమానుల్లో తలెత్తుతూనే వున్నాయి. వాళ్ల సందేహాలకు సమాధానంగా ‘మహానటి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. సావిత్రిని అభిమానించే ప్రేక్షకులంతా ఈ సినిమాకి నీరాజనాలు పడుతున్నారు.

Mahanati box office collection

‘మహానటి’ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ సినిమా ఇతర దేశాల్లోనూ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. దర్శకుడిగా నాగ్ అశ్విన్ ప్రయత్నాన్ని .. సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన కీర్తి సురేశ్‌కి అభినందనలు తెలియజేస్తున్నారు. యూఎస్‌లో శనివారం నాటికి ఈ సినిమా 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లను క్రాస్ చేసింది. ఈ సినిమా 2 మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకోవడానికి ఎంతో సమయం పట్టదని ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ చెప్పారు. ఆస్ట్రేలియా .. యూకే .. కెనడా.. న్యూజిలాండ్ ప్రాంతాల్లోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోందని ఆయన అన్నారు.

ఇక ఈ సినిమా దర్శక నిర్మాతలను చిరంజీవి స్వయంగా ఆహ్వానించి వాళ్లను సత్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం బాలకృష్ణ కోరిక మేరకు దర్శక నిర్మాతలు ప్రసాద్ ల్యాబ్స్ లో స్పెషల్ షోను ఏర్పాటు చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి బాలకృష్ణ ఈ సినిమాను ఎంతో ఆసక్తికరంగా వీక్షించినట్టు సమాచారం. బాలకృష్ణ దర్శక నిర్మాతల ప్రయత్నాన్ని ఎంతగానో అభినందించారు.

- Advertisement -