మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న మహాకోశల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉత్తరప్రదేశ్‌లో రైలు పట్టాలు తప్పింది. యూపీలోని మహోబా-కుల్పహర్ రైల్వే స్టేషన్ల మధ్య 8 బోగీలు పట్టాలు తప్పాయి. వీటిలో నాలుగు ఏసీ, నాలుగు జనరల్ బోగీలున్నాయి. 18 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ఘటనలో 10మంది ప్రయాణికులకుపైగా గాయాలయ్యాయి. గాయాలైనవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలను కొనసాగిస్తున్నది.
2016లో ఉత్తరప్రదేశ్‌లో పాట్నా – ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఘోరప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో 14 బోగీలు పట్టాలు తప్పగా… దాదాపు 110మంది ప్రాణాలు కోల్పోగా.. 250 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మళ్లీ ఆరు నెలలు తిరగక ముందే యూపీలో రైలు ప్రమాదానికి గురి కావడం ప్రయాణికులకు ఆందోళన కలిగిస్తోంది.