టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ కీలక నేతలు..

191
trs
- Advertisement -

ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆక‌ర్షితులై టీఆర్ఎస్ పార్టీలో ఇత‌ర పార్టీల నేత‌లు చేరుతున్నార‌ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

మాజీ కౌన్సిల‌ర్, మ‌త్స్య‌కార సంఘం జిల్లా అధ్య‌క్షుడు గంజి ఆంజ‌నేయులు, గంజి భాస్క‌ర్, గంజి రంజిత్‌, బాల‌కృష్ణ‌తో పాటు 100 మంది కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాచాన్‌ప‌ల్లి తండా స‌ర్పంచ్ శ్రీను నాయ‌క్‌, ఉప‌స‌ర్పంచ్ మోతీలాల్‌తో పాటు వార్డు మెంబ‌ర్లు, కార్య‌క‌ర్త‌లు గులాబీ గూటికి చేరారు. వీరంద‌రికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

- Advertisement -