కంగనాపై మరో కేసు నమోదు..

41
Kangana

వివాదాస్పద విషయాలతో ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే కంగనా రనౌత్‌పై కేసు నమోదు చేయాలని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే కంగనా రనౌత్ సోషల్ మీడియా ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ క్యాస్టింగ్ డైరెక్టర్, ఫిట్ నెస్ ట్రైనర్ మున్నావరలీ సయ్యద్ ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇందులో కంగన సోదరి రంగోలి పేరును కూడా చేర్చారు.

ఈ నేపథ్యంలో వీరిద్దరిపై కేసు నమోదు చేయాలని ముంబై పోలీసులను కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో కేసు నమోదైంది.ఇక కంగనా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె తమిళ నటి, రాజకీయవేత్త జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి’ చిత్రంలో నటిస్తోంది.