టీచర్ ఎమ్మెల్సీ..ఏవీఎన్ రెడ్డి విజయం

40
- Advertisement -

రంగారెడ్డి – మహబూబ్ నగర్ – హైదరాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ బలపర్చిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు. పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై సుమారు 1,150 ఓట్ల తేడాతో ఏవీఎన్ రెడ్డి గెలుపొందారు. ఎవరికి పూర్తి మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో విజయం సాధించారు ఏవీఎన్ రెడ్డి.

మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏవీఎన్ రెడ్డికి 7,505 ఓట్లు రాగా, పీఆర్టీయూ అభ్యర్థి చెన్నకేశవ రెడ్డికి 6,584, యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డికి 4,569, కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్దన్ రెడ్డికి 1,907 ఓట్లు వచ్చాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి 1,236 ఓట్లతో ఐదో స్థానంలో నిలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో సుమారు 1,150 ఓట్ల తేడాతో సమీప అభ్యర్థి చెన్నకేశవరెడ్డిపై ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు.

మొత్తం 29,720 ఓట్లలో 25,866 ఓట్లు పోలవగా సాయంత్రం 5గంటల వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. 50శాతంకు మించి ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓటును లెక్కించగా ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -