గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాలిః ఎంపీ కవిత

485
maloth-kavitha
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద గిరిజన శక్తి ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ మహాధర్న కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, గిరిజనశక్తి జాతీయ అధ్యక్షుడు రాజేశ్ నాయక్, పలువురు గిరిజన నేతలు పాల్గోన్నారు.

ఈసందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. ధామషా ప్రకారం తమకు రిజర్వేషన్లు కల్పించాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం మాకు 10శాతం రిజర్వేషన్లు రావాలి. గిరిజనులకు ధామషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీ తీర్మాణం చేసి కేంద్రానికి పంపారు. అసెంబ్లీ తీర్మాణాన్ని కేంద్రం పట్టుంచుకోవడం లేదు.ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ తండాలను గ్రామ పంచాయితీలుగా చేశారు. లంబాడ అడబిడ్డనైన నన్ను పార్లమెంట్ కు పంపారని గుర్తుచేశారు.

- Advertisement -