మొక్కలు నాటిన మహబూబ్ నగర్ కలెక్టర్ రోనాల్డ్ రోస్

293
Collector Ronald Rose

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించాఉ మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ డి. రోనాల్డ్ రోస్. ఈ రోజు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు.

అనంతరం కలెక్టర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణం బాగుండి వర్షాలు సమృద్దిగా కురుస్తాయని, ప్రతి ఒఒక్కరు మొక్కలు నాటి తమవంతు సామాజిక బాధ్యతను పూర్తి చేయాలని, అనుకూలంగా ఉన్న ప్రదేశాలలో విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మరో ముగ్గురికి ఆయన సవాల్ విసిరారు. జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేట్ జిల్లాల కలెక్టర్లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.