దిశ హత్యపై సోషల్ మీడియాలో పోస్ట్…అరెస్ట్ చేసిన పోలీసులు

262
Disha

దిశ హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దిశ హత్యకు కారణమైన నలుగురు నిందితులను ఉరి తీయాల్సిందేనని నిరసనలు చేస్తున్నారు. కాగా దిశ ఘటనపై సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు.

నిందితులను సమర్థిస్తూ , యువతను రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేసినందుకు యువకుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు సీసీస్ డీసీపీ అవినాష్ మహంతి. నిందితుడిపై వయోలేషన్ , ఐపీసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామన్నారు. ఈతరహా పోస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.