ఎంతోమందికి ప్రేరణగా నిలిచారు: కేటీఆర్

119
minister ktr

టోక్యో ఒలింపిక్స్‌ మ‌హిళ‌ల హాకీ కాంస్యం కోసం జరిగిన పోరులో భారత్ పోరాడి ఓడింది. భారత్ ఓడినా స్పూర్తిదాయ‌క‌మైన ఆట‌ తీరును కనబర్చి అందరి మనసు గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో భారత మహిళా హాకీ జట్టుపై ప్రశంసలు గుప్పించారు మంత్రి కేటీఆర్.

ఒలిపింక్స్‌లో మెడ‌ల్ కోసం ఎంతో శ్ర‌మించి, కోట్లాది మంది భార‌తీయుల హృద‌యాల‌ను గెలుచుకున్నార‌ని ప్ర‌శంసించారు. అంత‌ర్జాతీయ స్థాయిలో మ‌హిళ‌లు రాణించ‌గ‌ల‌ర‌న్న న‌మ్మ‌కాన్ని ప్ర‌ద‌ర్శించి.. ఎంతో మంది బాలిక‌ల‌కు ప్రేర‌ణ‌గా నిలిచార‌ని కేటీఆర్ కొనియాడారు.

కాంస్యం కోసం సాగిన పోరులో భారత్‌ను 4-3 తేడాతో ఓడించి పతకాన్ని సొంతం చేసుకుంది బ్రెజిల్.