మహా కుంభమేళాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే దారులన్నీ ట్రాఫిక్ జామ్‌తో రద్దీగా మారాయి. 100 నుంచి 300 కి.మీ వరకు వాహనాలు బారులు తీరాయి. ఇక మహా కుంభమేళా నేపథ్యంలో రైలు గ్లాసు ధ్వంసం చేశారు ప్రయాణికులు.
మహా కుంభమేళా నిమిత్తం ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న భక్తులతో రైళ్లు కిక్కిరిసాయి. తాజాగా బీహార్‌లోని మధుబని రైల్వేస్టేషన్‌లో స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్‌పై ప్రయాణికుల దాడి సంచలనంగా మారింది.
రైలులో కాలు పెట్టేందుకు కూడా స్థలం లేకపోవడంతో తలుపులు తెరవలేదు అధికారులు. ఆగ్రహానికి గురైన ప్రయాణికులు.. ఏసీ కోచ్ విండో గ్లాస్ పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
మరోవైపు త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 44 కోట్ల మంది భక్తుల పుణ్యస్నానాలు ఆచరింయగా ప్రయాగ్‌రాజ్ వెళ్లే మార్గాల్లో వాహనాల రద్దీ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.
Also Read:మోడీ అధ్యక్షతన AI సమావేశం
రెండు రోజుల పాటు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లొద్దని మధ్యప్రదేశ్ సీఎం మోహన్‌యాదవ్ సూచించారు. ఈ నెల 26తో ముగియనుంది మహా కుంభమేళా.

