రివ్యూ : మాస్ట్రో

226
maestro

నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాస్ట్రో. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అందాధున్ రీమేక్‌గా తెరకెక్కగా శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్‌రాగా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్ లో ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చిన నితిన్‌ ఏ మేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం.

కథ:

పియానో ప్లే చేసే కళ్ళు లేని అరుణ్‌ (నితిన్) అనే ఒంటరి కుర్రాడి కథ ఇది. ఇళయరాజాను అమితంగా ఇష్టపడే అరుణ్…విదేశాలకు వెళ్లి ఓ నైట్ క్లబ్ లో చేరి, పియానో ప్రాక్టీస్ చేస్తూ, కొంత డబ్బుల్ని వెనకేసుకుంటాడు. ఆ క్లబ్ ఓనర్ కుమార్తె సోషియా (నభా నటేశ్‌) అరుణ్‌పై ఇష్టాన్ని పంచుకోగా ఊహించని విధంగా మోహన్ (నరేశ్‌), అతని రెండో భార్య సిమ్రాన్ (తమన్నా) అరుణ్‌ జీవితంలోకి వస్తారు. తర్వాత ఏం జరుగుతుంది…?ఆ చిక్కుల నుండి అరుణ్ ఎలా బయటపడ్డాడు అన్నదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ నటీనటులు, కథ, నిర్మాణ విలువలు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నితిన్ తన నటనతో మెస్మరైజ్ చేశారు. కామెడీతో నవ్వులు పూయించారు. నభా నటేశ్‌ సైతం తనపాత్రకు వందశాతం న్యాయం చేసింది. సీటీమార్ లో క జ్వాలారెడ్డిగా మెప్పించిన తమన్నా ఇందులో పూర్తి భిన్నమైన పాత్రను చేసి తనకు తిరుగులేదనిపించింది. ఒకప్పటి కథానాయకుడు మోహన్ పాత్రలోకి నరేశ్ పరకాయ ప్రవేశం చేశారు. ప్రధాన పాత్రల్లో శ్రీముఖి, అనన్య, హర్షవర్థన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాసరెడ్డి, దువ్వాసి మోహన్, బిగ్ బాస్ సీజన్ 5 ఫేమ్ లహరి తదితరులు పర్వాలేదనిపించారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ప్రీ క్లైమాక్స్‌, తెలుగు నేటివిటి మిస్సవడం.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. రీమేక్ స్టోరీని అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు గాంధీ. మహతి స్వర సాగర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్. జె. యువరాజ్ సినిమాటోగ్రఫీ ,ఎస్.ఆర్. శేఖర్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువులు సినిమాకే హైలైట్. ఎక్కడా రాజీ పడలేదు.

తీర్పు:

ఈ ఏడాది చెక్, రంగ్‌దే ప్రేక్షకుల ముందుకువచ్చిన నితిన్ అంతగా మెప్పించలేకపోయారు. అయితే ఈసారి రీమేక్ సినిమాను నమ్ముకుని నితిన్ చేసిన ప్రయత్నం సత్ఫలితాన్నిచ్చింది. కామెడీ, నటీనటుల పర్ఫామెన్స్ సినిమాకు ప్లస్ కాగా ఈవారంలో ప్రేక్షకులను మెప్పించే మూవీ మాస్ట్రో.

విడుదల తేదీ:17/09/2021
రేటింగ్:2.75/5
నటీనటులు:నితిన్, నభానటేష్, తమన్నా
సంగీతం: మహతి స్వరసాగర్‌
నిర్మాతలు: ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి
దర్శకత్వం: మేర్లపాక గాంధీ