బిగ్ బాస్ 5 తెలుగు..ఎపిసోడ్ 12 హైలైట్స్

122
bb5

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 12 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 12వ ఎపిసోడ్ ఎనర్జిటీక్‌గా ఇంటి సభ్యులంతా కూల్ మైండ్‌తో నవ్వులు పూయించారు. తొలుత రెండు టీంలకు అగ్గిపుల్లలు ఇచ్చి ఇసుకలో వరుసగా గుచ్చి వెలిగించాలని చివరి వరకూ పుల్లలు ఆరిపోకుండా ఎవరివైతే వెలుగుతాయో ఆ టీం గెలిచినట్టు అని చెప్పారు. ఈ టాస్క్‌లో ఎల్లో టీంపై బ్లూ టీం గెలిచింది. ఇక పంతం నీదా నాదా టాస్క్‌లో ఈగల్ ( బ్లూ) టీం దగ్గర ఎక్కువ ఫ్లాగ్స్ ఉండటంతో విజేతలుగా నిలిచారు. అనంతరం శ్వేతా బర్త్ డే కావడంతో హమీదా, కాజల్‌లు కేట్ కట్ చేయించి సెలబ్రేట్ చేసుకున్నారు.

ఇక అర్ధరాత్రి మానస్- లహరి రొమాన్స్‌ చేస్తూ రచ్చ రచ్చ చేశారు. వీరిని కిచెన్ నుండి శ్రీరామ్, సిరి, ప్రియ అండ్ బ్యాచ్ చూస్తూనే ఉన్నారు. తర్వాత వీరిద్దరి దగ్గరికి వచ్చిన శ్రీరామ్‌ రాగా ఆయనకు మరింత కోపం వచ్చేలా మానస్.. ఏంటి లహరి పడుకుంటున్నావా? అని అడిగి.. ఓకే గుడ్ నైట్ అని దగ్గరకు తీసుకుని హగ్ ఇచ్చాడు. అది చూసి శ్రీరామ్ పక్కకి వెళ్లిపోయాడు. ఆ తరువాత లహరి నా బెడ్ వరకూ రా అని మానస్‌ని పిలిచింది. మానస్ ఆమె వెనుకే వెళ్లడంతో మైక్ తీసేసిన లహరి.. మానస్‌ని గట్టిగా కౌగిలించుకుంది. తర్వాత రోజు ఉదయం లహరి- మానస్‌లు రొమాంటిక్‌గా మాట్లాడుకుంటూ కనిపించారు.

పంతం నీదా నాదా టాస్క్‌లో శ్రీరామ్ టీం గెలవడంతో.. ఆ టీంలో బెస్ట్ పెర్ఫామర్స్‌ని ఎంపిక చేయాల్సిందిగా టీం కెప్టెన్ శ్రీరామ్‌ని అడిగారు బిగ్ బాస్. అయితే ప్రియని ఎంపిక చేసే అవకాశం లేదని చెప్పారు. దీంతో ఇది అన్యాయం బిగ్ బాస్ అని అనేసింది ప్రియ. తర్వాత అంతా చర్చించుకుని ఆనీ మాస్టర్, విశ్వ, హమీదా, ప్రియాంక‌లను ఎంపిక చేశారు.

అయితే ఈ నలుగురికి కొడితే కొట్టాలిరా కొబ్బరికాయ కొట్టాలి అనే టాస్క్ ఇచ్చారు. కొన్ని కొబ్బరి కాయలు ఇచ్చి ఇంటి సభ్యులు ఆ కొబ్బరి కాయల్ని కొట్టి.. ఎవరైతే కెప్టెన్ పోటీ దారులుగా ఉన్నారో వాళ్లకి ఎదురుగా ఉన్న బౌల్స్‌ని నింపాలని ఎవరి బౌల్ ముందు నిండితే వాళ్లే కెప్టెన్ అవుతారని చెప్పారు. రవి, జెస్సీ, శ్రీరామ్ తదితరులు విశ్వకి సపోర్ట్ చేయడంతో విశ్వ రెండోవారంలో హౌస్‌కి కెప్టెన్ అయ్యాడు.

ఇక సింగిల్ బెడ్ కోసం లోబో, ఉమాదేవిలకు అదిరిపోయే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ప్రియాంకతో కలిసి లోబో చేసిన ఆటో డ్రైవర్ టాస్క్‌ నవ్వులు పూయించింది. తర్వాత ఉమాదేవి.. సిరితో కలిసి చేసిన అత్తా కోడళ్ల టాస్క్ కూడా ఫన్ జనరేట్ చేసింది. అయితే ఇంటి సభ్యులు లోబోకి ఎక్కువ ఓట్లు వేయడంతో అతనికి సింగిల్ బెడ్ లభించింది.