గ్రీన్‌ ఛాలెంజ్‌..మొక్కలు నాటిన మదిమూవీ

116
- Advertisement -

టీఆర్ఎస్‌ ఎంపీ సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ జోరుగా కొనసాగుతోంది. ఈ ఛాలెంజ్‌లో ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటి వాటి ప్రాముఖ్యత గురించి వివరిస్తున్నారు. ఈ సందర్భంగా మది చిత్రయూనిట్‌ జూబ్లీహిల్స్‌ జీహెచ్‌ఎంసీ పార్క్‌లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చిత్ర నటీనటులు శ్రీరామ్‌, రిచా జోషి మరియు దర్శకుడు నాగధనుష్, నిర్మాత కిషన్‌ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టి దేశవ్యాప్తంగా కొనసాగించడం చాలా గొప్ప విషయమన్నారు.

ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే అవకాశం కల్పించినందుకు ఎంపీ సంతోష్‌ కుమార్‌కి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఈ ఛాలెంజ్‌ను స్వీకరించవలసిందిగా విరాజ్‌, ప్రాంజల్‌, ఐశ్వర్య ముగ్గురికి కోరారు.

ఇవి కూడా చదవండి..

ఆప్ సీఎం అభ్యర్థిగా ఇసుదన్ గాధ్విని..

పాలకుర్తి దేవాలయం..మహిమాన్వితం

రివ్యూ: ఊర్వశివో రాక్షసివో

 

- Advertisement -