కరోనా ఎఫెక్ట్‌..కమల్‌నాథ్‌ సర్కార్‌కు తాత్కాలిక ఊరట

210
mp assembly

కరోనా ఎఫెక్ట్‌తో మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌ నాథ్‌కు తాత్కాలిక ఊరట లభించింది. ఇవాళ మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో బలపరీక్ష జరగాల్సి ఉండగా సభ్యులంతా సభకు హాజరయ్యారు. అయితే కేంద్రం అన్నిరాష్ట్రాలను అప్రమత్తం చేసిన నేపథ్యంలో స్పీకర్ ప్రజాపతి అసెంబ్లీని మార్చి 26 వరకు వాయిదా వేశారు.దీంతో విశ్వాస పరీక్షకు బ్రేక్ పడింది.

జ్యోతిరాదిత్య సింధియా వర్గంలోని 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా వీరిలో ఆరుగురి ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ అమోదించారు. దీంతో ప్రస్తుత సభ్యుల సంఖ్య 222కు పడిపోగా 112 మంది మద్దతు తెలిపితే కమల్ నాథ్ గట్టెక్కుతారు. కాంగ్రెస్‌కు 108 మంది సభ్యుల బలం ఉండగా బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేలు న్నారు. ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే బీజేపీకి మద్దతు తెలపగా నలుగురు స్వతంత్రుల మద్దతు ఎటువైపు అన్నది కీలకంగా మారనుంది. కాంగ్రెస్,బీజేపీ రెండు పార్టీలు విప్ జారీ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఓటేయకుంటే వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది.