‘ఆచార్య’కు జోడీగా అనుష్క..?

327
Anushka

మెగాస్టార్‌ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రంలో చిరంజీవి దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఆచార్యను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో చిరుకు జంటగా అనుష్క నటించనునట్లు సమాచారం. ముందుగా ఈ సినిమాలో కథానాయికగా ‘త్రిష’ను తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి త్రిష తప్పుకోవడంతో కాజల్ పేరు వినిపించింది.

chiru

అయితే ఇప్పుడు తాజాగా మరో బ్యూటీ పేరు వినిపిస్తోంది. మరి ఆ బ్యూటీ మరెవరో కాదు అనుష్క. చిరంజీవి జోడీగా.. పాత్ర పరంగా అనుష్క అయితే కరెక్ట్ గా ఉంటుందని భావించి, ఆమెను సంప్రదిస్తున్నట్టుగా సమాచారం. ఈ ఆఫర్ ను అనుష్క వదులుకోకపోవచ్చని చెబుతున్నారు. గతంలో ‘స్టాలిన్’ సినిమాలో చిరూ సరసన అనుష్క ఒక ప్రత్యేక గీతంలో సందడి చేసిన సంగతి తెలిసిందే. అనుష్క ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ అనే సినిమాలో నటిస్తోంది.