నిన్న ఆసెంబ్లీ ,మండలి లో పెట్టిన కుల గణన సర్వే తప్పుల తడక అన్నారు శాసన మండలి ప్రతిపక్ష నేత ఎస్ .మధుసూదనా చారి. పార్టీలు ,బీసీ సంఘాలు ఈ సర్వే రిపోర్టు ను అంగీకరించడం లేదు..బీసీ లకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోంది …ఎన్నికల కమిషన్ జాబితా ప్రకారం 3 కోట్ల 35 లక్షల ఓటర్లు ఉన్నారు ..వాళ్లంతా 18 సంవత్సరాల పైబడ్డ వారేనన్నారు.
18 యేండ్ల లోపు వారు ఇంకో 25 శాతం అయినా ఉంటారు ..మొత్తం జనాభా 4 కోట్ల పైనే ఉంటుంది ..కులగణన లో సంఖ్య తక్కువ చేసి చూపారు..కులగణన అడుగుతారా అనే అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రిపోర్టు తయారు చేసి బీసీ లకు అన్యాయం చేసింది ..ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఎందుకు కులగణన చేయలేదు ..బ్రిటిష్ వాళ్ళు ,నిజాం కూడా కులగణన చేశారు ..నిన్నటి రోజు బీసీలకు పీడ దినం ..అసెంబ్లీ ,మండలి లో మా గొంతు నొక్కారు..ప్రభుత్వం తప్పును సవరించుకుంటుందని భావించాం అన్నారు.
..ఒక్క సామాజిక వర్గం జనాభా పెరిగినట్టు చూపారు ..బీసీ రిజర్వేషన్లు పెంచే బిల్లును అసెంబ్లీ మండలి లో తెస్తామని ఆశించాం .అలా చేయలేదు ..కాంగ్రెస్ కుట్ర పై బీ ఆర్ ఎస్ పోరాడుతుంది ..బీసీలకు న్యాయం జరిగే వరకు బీ ఆర్ ఎస్ ఉద్యమిస్తుంది …బీసీ లను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ చేసింది ,మండలికి చైర్మన్ చేసింది కేసీఆర్ యే ..ఇపుడు బీ ఆర్ ఎస్ లో ముగ్గురికి ప్రభుత్వ ప్రోటోకాల్ ఉంటే ఇద్దరు బీసీ లేనన్నారు.
Also Read:TTD:అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు