గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న మాధురి దుగ్గిరాల..

531
madhuri duggirala
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్3.0 కార్య క్రమంలో గూగుల్ డైరెక్టర్ రాహుల్ జిందాల్ విసిరినా చాలేంజ్ ని స్వీకరించి మొక్కలు నాటిన గూగుల్ మీడియా సర్వీసెస్ & ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్ మాధురి దుగ్గిరాల.

ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ మా డైరెక్టర్ రాహుల్ జిందాల్ గారు చెప్పినట్టు మనం మొక్కలు నాటడడం లో అశ్రద్ధ చూపుతున్నాం .కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దూరదృష్టితో , భావితరాలకు పచ్చని బాట కోసం పర్యావరణ పరిరక్షణ కోసం , అడవుల శాతం పెంపుదల కోసం హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.

దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంపీ శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశ వ్యాప్తంగా 5కోట్ల మొక్కలు నాటి ఎంతోమందిని ఈ బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకునేలా చేసింది .నేను మోకీలలో మా ఇంటి వద్ద టెంపుల్ ట్రీ, కోరల్ జాస్మిన్, రోజ్, మందార మరియు అలోవెరా మొక్కల పెంపకం మరియు బాల్కనీ తోట వద్ద మొక్కలు నాటడానికి నాకు అవకాశం వచ్చింది!జీవితాన్ని సృష్టించడం మరియు జీవితాన్ని పోషించడం నిజంగా ఒక అందమైన అనుభవం. అలానే మొక్కలు నాటడం వాటిని కాపడం మన బాధ్యత .ఒక యజ్ఞంలా ముందుకు దూసుకెళ్తున్న సంతోష్ కుమార్ ను స్ఫూర్తిగా తీసుకొని ఈ మొక్కలు నాటడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమం లో మరికొంత మందిని భాగస్వామ్యం చేయడం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్నాను . శివ గోపాల్ ,రమణి కటారి ,అపర్ణ తడికొండ , సైకత్ మిత్ర , ప్రీత వాస్తా లను గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించాల్సిందని కోరుతున్నానని చెప్పారు.

- Advertisement -