మాజీ ఎంపీ,కాంగ్రెస్ సీనియర్ మధు యాష్కి సొంతపార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కోమటిరెడ్డి బ్రదర్స్ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. భువన గిరిలో పోటీ చేయండి అని చెప్పి…ఆఖరి నిమిషంలో కోమటిరెడ్డి పోటీ చేసి తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా నియోజకవర్గం మారితే గెలిస్తానని…నియోజకవర్గాలు మారిన వాళ్ళు.. తాను ఓడిపోయానని చెప్పడం మానుకోవాలని హెచ్చరించారు.
ప్రస్తుతానికైతే పీసీసీ నియామకం ఆగిపోయిందని… రెండు పదవులు ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడం సరికాదన్నారు. సోనియా గాంధీ కి తప్పుడు సమాచారం ఇస్తున్నారని తెలిపిన మధుయాష్కి…. ఠాగూర్ చెప్పేదే ఫైనల్ కాదని స్పష్టం చేశారు.
పీసీసీ నియామకం సంక్లిష్టంగా మారిందని ఇది పార్టీకి మంచిది కాదని వెల్లడించారు. పార్టీలో బీసీ లకు ప్రాధాన్యత ఇవ్వకుంటే ఎన్నికల్లో నష్టం జరగదా..?… తప్పుడు నిర్ణయం తీసుకోవద్దని అధిష్టానం కి జానారెడ్డి చెప్పారన్నారు. రెడ్డిలకు అరేండ్లు పదవి ఇస్తే ఏం జరిగిందని… పార్టీ కి రెడ్లతోనే అధికారం రాదన్నారు.