మెరుగుపడిన దాదా ఆరోగ్యం..

51
ganguly

బీసీసీఐ చీఫ్,భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ క్రమక్రమంగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్ధితి మెరుగుపడుతుండటంతో రేపు డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు. గంగూలీ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని, వైద్య ప‌రంగా అత‌ను ఫిట్‌గా ఉన్నార‌ని తెలిపారు. సౌర‌వ్ మ‌రొక రోజు హాస్పిట‌ల్‌లో ఉండాల‌నుకుంటున్నార‌ని వెల్లడించారు.

గుండెపోటు వ‌చ్చిన సౌర‌వ్‌కు కోల్‌క‌తాలోని వుడ్‌ల్యాండ్స్ హాస్పిట‌ల్‌లో చికిత్స జరుగుతుండగా రెండు స్టంట్లు వేశారు. ఇక దాదా ఆరోగ్య పరిస్ధితిపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తున్న ఆస్పత్రి వర్గాలు తాజాగా రేపు ఆయన్ని డిశ్చార్జ్ చేస్తామని ప్రకటించాయి.