తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని నటి మాధవీలత ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం తాజా రాజకీయాలపై దృష్టి పెట్టారు . తనకు బీజేపీ సిద్దాంతాలు నచ్చినందుకే ఆ పార్టీలో చేరానని తెలిపింది. బీజేపీ తరపున తనను ఎక్కడ ప్రచారం చేయమన్నా చేస్తానని చెప్పింది. తెలంగాణలో కాకుండా జాతీయ స్థాయిలో పని చేయాలనే కోరికగా ఉందని వెల్లడించింది.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ ప్రాంతం నుంచైనా పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానని, తనకు ఎలాంటి ప్రాంతీయ భేదాలు లేవని చెప్పింది. తన కుటుంబం నుంచి చాలా మంది ఆర్మీలో ఉన్నారని తెలిపింది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు ఎన్నోసార్లు మాట తప్పారని విమర్శించింది. ఏపీకి కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున్న నిధులు ఇచ్చిందని, కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదా..? అని ఆమె ప్రశ్నించింది.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు విషయంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించింది. ఒక్క లారీ ఇసుకకు రూ.5 లక్షల వరకు బిల్లులు పెట్టారని పేర్కొంది. కానీ నేను మాత్రం క్యాస్టింగ్ కౌచ్ పై ప్రశ్నిస్తూనే ఉంటానని తెలిపింది. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే తనకు ఎంతో అభిమానమని చెప్పింది.