“టాక్సీవాలా” మెలోడి సాంగ్ వీడియో..

632
- Advertisement -

“అర్జున్ రెడ్డి, “గీత గోవిందం” సినిమాల అనంతరం యువ హీరో విజయ్ దేవరకొండ మంచి ఫాంలోకి వచ్చాడు. టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్న విజయ్.. తాజాగా “టాక్సీవాలా” అనే చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ మూవీకి సంబంధించిన అన్నీ పనులు పూర్తి చేసుకుని నవంబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే.. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. గ్రాఫిక్స్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది.

ఇక చిత్రం రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్సిపటికే నిమాలోని ఓ లిరికల్ వీడియోను విడుదల చేయగా.. పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. జిఏ2 పిక్చర్స్, యు.వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ సస్పెన్స్, సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశాన్ని హిలేరియస్ కామోడీతో తెరకెక్కుతోంది.

అయితే తాజాగా మరో సాంగ్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ప్రస్తుతం విడుదలైన పాటలో విజయ్ టాక్సీ డ్రైవర్‌గా కనిపించాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో హిట్ కొట్టిన విజయ్.. ఇప్పుడు టాక్సీ వాలా
చిత్రంతో మరోసారి వెండితెరపై సందడి చేయనున్నాడు.

- Advertisement -