మీ కాళ్లకు దండం పెడతా…అవకాశాలు ఇవ్వండిః నటి హేమ

639
Hema
- Advertisement -

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన కమిటి ఏర్పడిన తర్వాత తొలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు నటీనటులు మా సభ్యులు పాల్గోన్నారు. ఈసమావేశంలో నటి హేమ మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇండస్ట్రీలో చాలా మంది మహిళలు కష్టపడుతున్నారని చెప్పారు. వారిని రచయితలు, దర్శకులు ఆదుకోవాలని కోరారు. ఇతర ఇండస్ట్రీల వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా తెలుగు వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

ముందు మన ఇంట్లో ఉన్న ఆడవాళ్లకు తిండి పెట్టండి. ఎక్కడో బయటి నుంచి లేడీ ఆర్టిస్టులను తీసుకువచ్చి తెలుగు ఆర్టిస్టులకు అన్యాయం చేయొద్దు. ఇవాళ ఇండస్ట్రీలో ఆడవాళ్లు చాలా కష్టాలు పడుతున్నారు. వాళ్ల ఆకలి బాధను గుర్తించండి. ‘మా’లో 800 మంది సభ్యులుంటే వాళ్లలో ఓ 150 మంది మహిళలు ఉంటారు.

కనీసం వాళ్లకు అన్నం పెట్టి కట్టుకోవడానికి బట్టలు కూడా ఇవ్వలేమా? మీ కాళ్లకు దండం పెడతాను సార్, దయచేసి మన తెలుగు మహిళా ఆర్టిస్టులకు అవకాశాలు ఇవ్వండి” అంటూ హేమ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కార్య్ర‌క‌మంలో శివ‌బాలాజీ, సురేష్ కొండేటి, సుద‌ర్శ‌న్‌, గౌతంరాజు, పరుచూరి బ్రదర్స్ , కవిత, కృష్ణంరాజు దంపతులు , మా సభ్యులు పాల్గోన్నారు.

- Advertisement -