మా ‘అధ్య‌క్షుడు’ శివాజీ రాజా బర్త్ డే సెలెబ్రేషన్స్..

381
MAA President Shivaji Raja Birthday Celebrations
- Advertisement -

`మా` అధ్య‌క్షుడు శివాజీ రాజా పుట్టిన రోజు వేడుక‌లు సోమ‌వారం ఉదయం `మా` కార్యాల‌యంలో నిడారంబ‌రంగా జ‌రిగాయి. `మా` కార్య‌వ‌ర్గ స‌భ్యులు..ప‌లువురు ఆర్టిస్టులు కేక్ క‌ట్ చేసి శివాజీ రాజాకు తినిపించి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా `మా` కోసం పాటుప‌డుతోన్న శివాజీ రాజా నిరంత‌ర కృషిని కొనియాడారు.

MAA President Shivaji Raja Birthday Celebrations

ఈ వేడుక‌ల్లో సీనియ‌ర్ ద‌ర్శ‌కులు ఎస్. వి. కృష్ణారెడ్డి, మా వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ నరేష్‌, జాయింట్ సెక్ర‌ట‌రీ ఏడిద శ్రీరామ్, వైస్ ప్రెసిడెంట్ బెన‌ర్జీ, క‌ల్చ‌ర‌ల్ క‌మిటీ చైర్మ‌న్ సురేష్ కొండేటి, కార్య వ‌ర్గ స‌భ్యులు సురేష్‌, గీతాసింగ్, వెంక‌ట గోవింద‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అలాగే ప్ర‌తీ ఏడాది శివాజీ రాజా పుట్టిన రోజు సంద‌ర్భంగా బ‌స‌వ‌తార‌కం క్యాన్సర్ ఆసుప‌త్రిలో రోగుల‌కు ప‌ళ్లు పంచుతుంటారు. ఈ ఏడాది కూడా త‌న బ‌ర్త్డ డే సంద‌ర్భంగా య‌ధావిధిగా ప‌ళ్లు పంచ‌డం జ‌రిగింది.

- Advertisement -