మా ఎన్నికలపై కృష్ణంరాజుకు లేఖల పర్వం!

29
krishnam raju

సాధారణ ఎన్నికలను తలపించేలా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌(మా) ఎన్నికలు రోజురోజుకు ఆసక్తిని పెంచేస్తున్నాయి. మా అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి…మా క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుకు లేఖ రాయగా చిరుకు మద్దతుగా పలువురు నటులు లేఖలు రాస్తున్నారు.

ఇప్పటివరకు 113 మంది మా ఎన్నికలు నిర్వహించాలని కృష్ణంరాజుకు లేఖలు రాశారు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ విష‌యం ప్ర‌స్తుతం టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మరి ఈ లేఖల అంశంపై కృష్ణం రాజు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

మొన్న‌టి వ‌ర‌కు మా స‌భ్యులు, అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేసే వాళ్లు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోగా, న‌టి హేమ ప్ర‌స్తుత అధ్య‌క్షుడిగా ఉన్న న‌రేష్‌ని ఉద్దేశించి తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన సంగతి తెలిసిందే. నిధుల దుర్వినియోగంపై నరేష్‌పై హేమ చేసిన ఆరోపణలపై నోటీసులు కూడా ఇచ్చారు. ఇక దీనిపై హేమ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.