19న దోచుకునేందుకు వస్తున్న రాజరాజచోర!

124
raja raja chora

యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా, మేఘా ఆకాష్, సునయన హీరోయిన్లుగా.. హసిత్ గోలీ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘రాజ రాజ చోర’. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్ ఫ్రెష్‌ కంటెంట్‌తో హిలేరియస్‌గా ఉండడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక టీజర్‌లో శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్స్, హిట్‌ ఇస్తున్న కామెడీ, బాడీ లాంగ్వేజ్, కంటెంట్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. తాజాగా రిలీజ్ డేట్ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

ఆగస్టు 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు మేకర్స్. వివేక్‌ సాగర్‌ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రానికి వేదరామన్‌ కెమెరామ్యాన్‌గా బాధ్యతలు స్వీకరించారు.