ప్రకాశ్‌ రాజ్‌కి జై కొట్టిన సాయికుమార్..!

206
sai kumar
- Advertisement -

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రకాశ్ రాజ్,మంచు విష్ణు,సీవీఎల్ నరసింహారావు బరిలో ఉండగా ప్రధానంగా విష్ణు, ప్రకాశ్ రాజ్ మధ్య పోటీ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఎవరికి వారు తమ సపోర్టును బహిరంగంగానే ఆయా ప్యానెల్‌లకు ప్రకటించగా తాజాగా సాయికుమార్…ప్రకాశ్‌ రాజ్‌కు మద్దతుగా నిలిచాడు. వీరిద్దరి భావాలు వేరేనా సాయి…ప్రకాశ్‌కు మద్దతుగా నిలవడం విశేషం.

ఎందుకంటే బీజేపీ పార్టీలో ఉన్న సాయి… ఆ పార్టీ మద్దతుదారుడైన నరసింహారావును కాదని ప్రకాశ్‌కు అండగా నిలిచారు. సిని‘మా’ బిడ్డలం.. మనకోసం మనం.. మా కోసం మనం.. అనే నినాదంతో ముందుకు వస్తున్న ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో నేను ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు. నాతో పాటు మీరు కూడా సపోర్ట్ చేయండి. మీ అభిమానంతో పాటు.. కళామ్మతల్లి ఆశీర్వాదాలు మాకు.. మా అందరికీ ఉండాలని కోరుకుంటూ జైహింద్’ అంటూ వీడియో విడుదల చేశారు నటుడు సాయి కుమార్.

- Advertisement -