హిట్ కోసం పట్టువదలని సుమంత్..!

164
hero sumanth
- Advertisement -

టాలీవుడ్‌ హీరో సుమంత్ పట్టు వదలని విక్రమార్కుడిలా విజయం కోసం పోరాడుతూనే ఉన్నాడు. ఈ హీరో టాలీవుడ్‌లో చాలా కాలంగా తన కెరియర్‌ను కొనసాగిస్తున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. జయాపజయాల సంగతి అటుంచితే, సాధ్యమైనంత వరకూ కొత్త కథలతోనే ప్రేక్షకుల ముందుకు వెళ్లడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ‘ఇదమ్ జగత్’ .. ‘కపటధారి’ సినిమాలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తాయి.

చాలాకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న సుమంత్ తాజాగా మరో చిత్రంతో రంగంలోకి దిగాడు.. కీర్తికుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈరోజు ఈ మూవీ పూజా కార్యక్రమాలను జరుపుకుంది. రెడ్ సినిమాస్ వారు ఈ సినిమాను నిర్మిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. శివకుమార్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

- Advertisement -