‘మా’ ఎన్నికల్లో ఓటు వేసిన పలువురు ప్రముఖులు..

100
- Advertisement -

‘మా’ ఎన్నికలు ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. జూబ్లీ హిట్స్ లోని పబ్లిక్ స్కూల్ లో ఉదయం 8గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. సినీ తారలు ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ‘మా’ ఎన్నికల్లో తొలి ఓటును వినియోగించుకున్నారు. అందరికంటే ముందే ఉదయం పోలింగ్ కేంద్రానికి చేరుకొని మొదటి ఓటు వేశారు. ఆ తర్వాత సినీ ప్రముఖులు అంతా ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేస్తున్నారు.

రామ్ చ‌ర‌ణ్‌, చిరంజీవి,బాల‌కృష్ణ‌, సాయి కుమార్,రాశీ, శివ బాలాజీ, వ‌డ్డే న‌వీన్,వేణు, నరేశ్, శివాజీరాజా, సుడిగాలి సుధీర్ సహా సినీ ప్రముఖులు అంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హీరోయిన్ జెనీలియా కూడా ‘మా’లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మా పోలింగ్ కొనసాగుతుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాలను కూడా ఇదే రోజు రాత్రి ప్రకటిస్తారు. రాత్రి 8 గంటలలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

- Advertisement -