బిగ్ బాస్ 5.. ఈ వారం హమీదా ఎలిమినేట్..!

35

తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 5లో ఇప్పటివరకు 4 వారాలు పూర్తి అయ్యింది. ఈ నాలుగు వారాల్లో నలుగురు కంటెస్టెంట్స్ బ్యాగ్‌లు సర్దేశారు. ఇప్పటి వరకు సరయు.. ఉమా.. లహరి.. నటరాజ్ లు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం ఏకంగా తొమ్మిది మంది ఎలిమినేషన్‌కు నామినేట్ అవ్వడం జరిగింది. నామినేట్ అయిన వారిలో ఎవరెవరు ఉన్నారంటే.. లోబో,సన్నీ,హమీదా,మానస్, ప్రియ, జెస్సీ, యాంకర్ రవి, షణ్ముఖ్, విశ్వ ఉన్నారు.

కెప్టెన్ అయిన శ్రీరామ చంద్ర మినహా అబ్బాయిలు అంతా కూడా నామినేట్ అయ్యారు. ఇక అమ్మాయిల్లో ప్రియా మరియు హమీదాలు నామినేట్ అయ్యారు. ప్రియా కెప్టెన్ అవ్వడంతో పాటు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కనుక ఆమె ఉంటుందని అంతా అనుకున్నారు. హమీదా కు శ్రీరామ చంద్రకు మద్య లవ్ ట్రాక్ నడుస్తున్న నేపథ్యంలో ఆమె ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అంతా భావించారు. విశ్వ లేదా లోబోల్లో ఒక్కరు ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా హమీదాను ఎలిమినేట్ చేసినట్లుగా లీక్ అందుతోంది.

ఆదివారం ఎపిసోడ్ లో హమీదాను ఎలిమినేట్ చేయడం కన్ఫర్మ్ అయ్యిందని విశ్వసనీయంగా సమాచారం అందుతోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన షూటింగ్ కూడా జరిగింది. మొదటి వారం నుండి కూడా శనివారం రోజే ఎవరు ఎలిమినేట్ అయ్యేది లీక్ అవుతుంది. కనుక ఈ వారంలో కూడా లీక్ అయినట్లుగా హమీదానే ఎలిమినేట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే హమీదా సీక్రెట్ రూమ్ కు వెళ్లి తిరిగి వచ్చే అవకాశాలు కూడా లేక పోలేదు.

ఎందుకంటే ఇంట్లో ఒక మంచి లవ్ ట్రాక్ నడుస్తున్న సమయంలో దాన్ని ఖచ్చితంగా బ్రేక్ చేయాలని అనుకోరు. అందుకే బిగ్ బాస్ టీమ్ కాస్త ఆటను రసవత్తరంగా సాగించేందుకు గాను ఈ విధంగా సీక్రెట్ రూమ్‌కు హమీదాను పంపించి తిరిగి మళ్లీ లోనికి పంపిస్తారేమో అనే టాక్ వినిపిస్తుంది. సీక్రెట్ రూమ్‌లో హమీదా రెండు మూడు రోజులు ఉండి మళ్లీ తిరిగి వస్తుందా లేదంటే హమీదా నిజంగానే ఎలిమినేట్ అయ్యిందా అనేది ఆదివారం నాటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.