సినిమాటోగ్ర‌ఫీ మంత్రికి `మా` డైరీ అంద‌జేత

103
MAA

మూవీ ఆర్టిస్టుల సంఘం అధికారిక డైరీ `మా డైరీ-2017`ని మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌ల‌ ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా శ‌నివారం ఉద‌యం `మా` మెంబ‌ర్స్ అంతా క‌లిసి తెలంగాణ రాష్ట్ర‌ సినిమాటోగ్ర‌ఫి మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కు కొత్త డైరీని అంద‌జేశారు.

MAA

`మా`అధ్య‌క్షులు డా. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, `మా` ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శివాజీరాజా, మా మెంబ‌ర్ ఏడిద శ్రీరామ్, `సంతోషం` అధినేత సురేష్ కొండేటి స‌మ‌క్షంలో డైరీని అందించారు. మా డైరీ ముఖ‌చిత్రం స‌హా డిజైన్ చేసిన విధానం చాలా బావుంద‌ని ‘మా’ బృందాన్ని సినిమాటోగ్ర‌ఫీ మంత్రి ప్ర‌శంసించారు.