జల్లికట్టుపై సెహ్వాగ్‌ కామెంట్..

212
Tamil
- Advertisement -

క్రికెట్‌కు సంబంధించిన విషయాలతో పాటు..సామాజిక అంశాలపై కూడా స్పందించే మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తాజాగా జల్లికట్టు పై కామెంట్ చేశాడు. తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టు నిర్వహణకు అవకాశమివ్వాలంటూ తమిళనాట నిరసనలు పెల్లుబుకుతున్న సంగతి తెలిసిందే. లక్షల మంది యువతతో మెరీనా తీరం జనసంద్రంగా మారింది. ప్రజలను ఉపశమింపజేసేందుకు తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నేపథ్యంలో సెహ్వాగ్‌ స్పందించాడు. ‘ఇది తమిళ ప్రజల అద్భుత విజయం, జల్లికట్టు నిర్వహించడం అనివార్యం’ అనే అర్థంలో ట్విట్టర్‌లో వ్యాఖ్యలు పెట్టాడు.

జల్లికట్టు నిషేద నిర్ణాయాన్ని వ్యతిరేకిస్తూ..తమిళనాట జరుగుతున్న నిరసనలకు సినీనటులు, రాజకీయ నాయకులు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. దీనికి మాజీ క్రికెటర్ సెహ్వాగ్‌ కూడా ట్విట్టర్ ద్వారా మద్దతు తెలిపడం విశేషం. సంప్రదాయ జల్లికట్టు క్రీడపై సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని నిలిపివేసేలా రూపొందించిన ఆర్డినెన్స్కు తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు శనివారం ఆమోదం తెలిపారు. జల్లికట్టును పునరుద్ధరించాలంటూ గడిచిన ఐదు రోజులుగా తమిళనాడు వ్యప్తంగా కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో దిగివచ్చిన కేంద్రప్రభుత్వం.. శుక్రవారమే ఈ ఆర్డినెన్స్‌కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్‌ ముసాయిదాలో కొద్దిపాటి మార్పులుచేసి కేంద్ర హోం, న్యాయ, పర్యావరణ మంత్రిత్వ శాఖలు ఆమోదించాయి.

- Advertisement -